నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి..

by Taduka Kalyani |

మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో దుడ్డు అనిత శేఖర్లకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.

నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి..
X

దిశ, తలకొండపల్లి: మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో దుడ్డు అనిత శేఖర్లకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చిన్న కుమారుడు అభిరామ్ ఇంటి ముందు తన చెల్లి తో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో శేఖర్ అతని భార్య అనిత పెద్ద కుమారుడితో ఇంట్లోనే ఉన్నారు. ఇంటి ముందు తన చెల్లి తో కలిసి ఆడుకుంటున్న అభిరామ్ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోవడంతో, తన చెల్లెలు ఇంట్లోకి ఏడ్చుకుంటూ వెళ్ళింది. పాప ఏడుస్తూ ఇంట్లోకి రావడం తో గమనించిన తల్లిదండ్రులు వెంటనే అభిరామ్ ను వెతకడం ప్రారంభించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో వెతికిన అభిరామ్ కనిపించలేదు. తీరా వాళ్ళ ఇంటి ముందు ఉండే నీటి సంపులో పడి ఉండడం చూసి వెంటనే చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని హస్తినాపురంలో సంరక్షణ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. మళ్ళీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు నీలా పూర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం రాత్రి అభిరామ్ చికిత్స పొందుతూ మరణించినట్లు డాక్టర్లు పేర్కొన్నారు . కళ్ళ ముందే ఆడుకుంటున్న తన కన్న కొడుకు క్షణాల వ్యవధిలో నీటి సంపులో పడి చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రి దుడ్డు శేఖర్ ఫిర్యాదు మేరకు తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Next Story