- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరిలో పర్యాటకుడు గల్లంతు..
by Batti.Sumithra |
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన బొంబాయికి చెందిన పర్యాటకుడు ఫిరోజ్ (28) ఎస్సారెస్పీ దిగున ఉన్న వరద గేట్ల వద్ద గోదారి ప్రవాహంలో గల్లంతయ్యాడు.

X
దిశ, బాల్కొండ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన బొంబాయికి చెందిన పర్యాటకుడు ఫిరోజ్ (28) ఎస్సారెస్పీ దిగున ఉన్న వరద గేట్ల వద్ద గోదారి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ముంబై నుండి కోరుట్లలో ఉన్న బంధువుల వద్దకు వచ్చి ఆదివారం బంధుమిత్రులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు.
దిగవరం ఉన్న వరద గేట్ల వద్ద గోదావరి నదిలో సరదాగా ఆడుతున్న సమయంలో ఫిరోజ్ నీళ్లలో దిగాడు. అప్పుడే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఫిరోజ్ కొట్టుకొని పోవుతుండడంతో మిత్రుడు రోహిత్ వెంటనే నీళ్లలోకి దూకాడు. అప్పటికే ఫిరోజ్ నీట మునిగి గల్లంతయ్యాడు. రోహిత్ తర్వాత ఒడ్డుకు చేరుకున్నాడు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి ఎస్ఐ నారాయణ సిబ్బందితో కలిసి ఫిరోజ్ స్నేహితులను సమాచారం అడిగి తెలుసుకున్నారు.
Next Story






