అయోధ్య రామమందిరంపై సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ

by Shamantha N |

అయోధ్య రామమందిర కార్యక్రమం సందర్భంగా డీఎంకే ఎంపీ ఏ రాజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సేలంలో జరిగిన సభలో పాల్గొన్నారు ఎంపీ ఏ రాజా.

అయోధ్య రామమందిరంపై సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామమందిర కార్యక్రమం సందర్భంగా డీఎంకే ఎంపీ ఏ రాజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సేలంలో జరిగిన సభలో పాల్గొన్నారు ఎంపీ ఏ రాజా. కావాల్సింది తమిళ జాతీయవాదం.. హిందూ జాతీయవాదం కాదన్నారు. జాతీయత అనేది మతంపైన కాకుండా బాషపైన ఆధారపడుతుందన్నారు. తమిళనాడుకు ద్రవిడ జాతీయవాదం, తమిళ జాతీయవాదం అవసరమని, హిందూ జాతీయవాదం కాదన్నారు.

మేం కులం పేరుతో విడిపోయాం.. మీరు కులం పేరుతో ఒక్కటి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీని ఉద్దేశించి ఘాట వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం మతం పేరుతో ఐక్యంగా ఉండాలనుకుంటున్నామన్నారు. కానీ బీజేపీ చెప్పినట్లు హిందువులుగా ఉండకూడదని.. హిందూ జాతీయవాదం అక్కర్లేదన్నారు. తమకు ద్రావిడ లేదా తమిళ జాతీయవాదం కావాలని స్పష్టం చేశారు. బీజేపీ హిందూ దేశాన్ని కోరుకుంటోందని బీజేపీని ఉద్దేశించి దుయ్యబట్టారు. బీజీపీ హిందూ దేశం గురించి మాట్లాడుతుందని.. ఇంతకు ముందు మతం పేరుతో దేశం లేదని గుర్తుచేశారు. పాక్ భారత్ నుంచి ఎందుకు విడపోయిందంటే.. సావర్కర్ హిందూ దేశం అని చెప్పినందుకే అన్నారు.

Next Story