ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముస్లిం మతపెద్ద.. ఏమన్నారో తెలుసా ?

by Dishanational4 |
ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముస్లిం మతపెద్ద.. ఏమన్నారో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఇది కొత్త భారతదేశం. నేను ప్రేమ సందేశంతో అయోధ్యకు వచ్చాను. మనకు వేర్వేరు ఆరాధనలు, విభిన్న నమ్మకాలు ఉండొచ్చు. కానీ మనకు దేశమే ఫస్ట్. అన్నింటికంటే మన అతిపెద్ద మతం మానవత్వం. మనమందరం కలిసి మానవత్వాన్ని చెక్కుచెదరకుండా ఉంచాలి’’ అని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ పేర్కొన్నారు. ఆయన సోమవారం ఉత్తరప్రదేశ్‌‌లోని అయోధ్యలో జరిగిన రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సాధువుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ద్వేషాన్ని అంతం చేయడమే నేటి సందేశం. శత్రుత్వాలు, రాజకీయాలు అన్నీ వీడి మన దేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పని చేద్దాం. మన దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి’’ అని ఇమామ్ ఉమర్ పేర్కొన్నారు. నెటిజన్లు ఈ వీడియోను చూసి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ‘నేడు గర్వంగా ఉంది’ అంటూ కొందరు వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఈ సీన్‌ను చూస్తుంటే నిజంగా రామరాజ్యం ఇలాగే ఉండేదేమో అనిపించిందని ఒకరు కామెంట్ పెట్టడం గమనార్హం.



Next Story

Most Viewed