Volkswagen: త్వరలోనే వోక్స్ వేగన్ లాంచ్...ఫీచర్లు, ధర తెలిస్తే కొనేస్తారు

by Vennela |

Volkswagen Tiguan R Line Look Features: వోక్స్‌వ్యాగన్ ఇండియా తన ప్రత్యేకమైన SUV టిగువాన్ ఆర్-లైన్‌ను ఏప్రిల్ 14న భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది.

Volkswagen: త్వరలోనే వోక్స్ వేగన్ లాంచ్...ఫీచర్లు, ధర తెలిస్తే కొనేస్తారు
X

దిశ, వెబ్ డెస్క్: Volkswagen Tiguan R Line Look Features: వోక్స్‌వ్యాగన్ ఇండియా తన ప్రత్యేకమైన SUV టిగువాన్ ఆర్-లైన్‌ను ఏప్రిల్ 14న భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. అంతకు ముందు కంపెనీ దాని లుక్, ఫీచర్లను ఆవిష్కరించింది. ఈ SUVలో LED ప్లస్ హెడ్‌లైట్లు, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు, 30 రంగుల యాంబియంట్ లైటింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ లాంచ్ కు ముందే లుక్స్, ఫీచర్లు లీక్ అయ్యాయి. కంపెనీ టిగువాన్ ఆర్-లైన్ ఇంటర్నల్, ఎక్సటర్నల్ ఫీచర్లను వెల్లడించింది. ఆకట్టుకునే డిజైన్, ప్రీమియం ఫీచర్లతోపాటు యూజర్ కంఫర్ట్ గా ఉండేందుకు కంపెనీ ఎక్కువ శ్రద్ద తీసుకుంది. ఇది 'R' థీమ్డ్ బాహ్య, అంతర్గత అంశాలతో పాటు మసాజ్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, పార్క్ అసిస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, 30-రంగు యాంబియంట్ లైటింగ్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్స్ ఇందులో ఉంటాయి.

చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్న వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఏప్రిల్ 14న భారత్ తో లాంచ్ అవుతుంది. దీని ధర రూ. 40 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిజైన్ ,సౌకర్యం పరంగా ఈ SUV ముందంజలో ఉందని కంపెనీ పేర్కొంది. బాహ్య భాగం గురించి మాట్లాడుకుంటే, టిగువాన్ R-లైన్ ముందు భాగం చాలా బోల్డ్, పవర్ ఫుల్ గా ఉంది. ఇందులో LED ప్లస్ హెడ్‌లైట్లు,గ్లాస్ తో కప్పి ఉన్న లెవల్ స్ట్రిప్, బాడీపై అథ్లెటిక్ షోల్డర్ లైన్, 'R-లైన్'తో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, కొత్త క్షితిజ సమాంతర LED స్ట్రిప్‌తో 3D LED వెనుక లైట్లు ఉన్నాయి. దాని డోర్ హ్యాండిల్‌లో కూడా లైటింగ్ ఉంటుంది. దీనికి స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్స్, వెల్‌కమ్ లైట్, స్పోర్ట్స్ స్టైల్ బంపర్, క్రోమ్ ట్రిమ్‌తో ఎయిర్-ఇంటెక్, సిల్వర్ రూఫ్ రెయిల్స్ కూడా లభిస్తాయి. ఈ కారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ బాహ్య రూపం మాత్రమే కాదు, ఇంటర్నల్ ఫీచర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ SUV డిజైన్ లోనే కాదు, సౌకర్యంలోనూ చాలా ముందుంది. ఇది మసాజ్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, 30-కలర్ యాంబియంట్ లైట్లు, సీట్లపై R బ్యాడ్జింగ్, పార్క్ అసిస్ట్ ప్లస్, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ ఛార్జింగ్ పోర్ట్‌లు, సౌకర్యవంతమైన సీట్లను కలిగి ఉంటుంది. ఈ SUV ఇంజిన్, పవర్, ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించిన సమాచారాన్ని వోక్స్‌వ్యాగన్ త్వరలోనే ప్రకటించనుంది.

ఇక వోక్స్ వ్యాగన్ ఇండియా కొత్త టిగువాన్ ఆర్ లైన్ ఎస్ యూవీని పెర్సిమోన్ రెడ్ మెటాలిక్, నైట్ షేడ్ బ్లూ మెటాలిక్, గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్, ఓరిక్స్ వైట్ మదర్ ఆఫ్ పెర్ల్ ఎఫెక్ట్, సిప్రెసినో గ్రీన్ మెటాలిక్, ఓస్టెర్ సిల్వర్ మెటాలిక్ అనే 6 కలర్స్ వేస్ లో అందుబాటులోకి వస్తుంది.

Next Story