- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hero Splendor Plus: డిస్క్ బ్రేక్ ఎవడబ్బా సొత్తు కాదు.. ఇప్పుడు స్ల్పెండర్ కి కూడా ఉంది.. ధర ఎంతంటే?
Hero Splendor Plus: దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహనతయారీదారు సంస్థ అయితే హీరో మోటోకార్ప్ అత్యంత ప్రజాదరణ పొందిన స్ల్పెండర్ ప్లస్ 2025 మోడల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: Hero Splendor Plus: దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహనతయారీదారు సంస్థ అయితే హీరో మోటోకార్ప్ అత్యంత ప్రజాదరణ పొందిన స్ల్పెండర్ ప్లస్ 2025 మోడల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. డిజైన్ పరంగా పెద్దగా మార్పలు చేయనప్పటికీ అద్భుతమైన లుక్ లో కనిపిస్తుంది. చిన్న చిన్న మార్పులను మాత్రమే చేసింది. అయినా కూడా కస్టమర్లను ఈ బైక్ చాలా ఆకట్టుకుంటుంది. స్ప్లెండర్ ప్లస్ లైనప్ లో స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్, స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ 2.0 వేరియంట్లను తీసుకువచ్చింది. వీటి ధరలతోపాటు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఓల్డ్ మోడల్ బైక్ లో ఏ ఇంజిన్ అయితే ఇచ్చారో ఈ స్ల్పెండర్ ప్లస్ 2025మోడళ్లలోనూ దాన్నే కొనసాగించారు. ఫేజ్ 2 ఓబీడీ 2బీ ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్ న్ తీర్చిదిద్దారు. 2025 ఏప్రిల్ 1 తర్వాత విక్రయించే వాహనాలన్నీ ఈ ప్రమాణాలను పాటించాలని కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీనిలో 4 స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది. ఇది 7. 91బీహెచ్పీ పవర్ ను , 8న05 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గ్రాఫిక్స్ పరంగా కొన్ని మార్పులను చేసింది. స్పోర్టీ లుక్ ను జోడించారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఇచ్చారు. సీటు, లగేజీ ర్యాక్ లో మార్పులు చేశారు. అయితే ఇవి టాప్ ఎండ్ మోడళ్లకే పరిమితం చేశారు.
ఇక హీరో స్ల్పెండర్ ప్లస్ మొత్తం 6 రకాల వేరియంట్లలో లభిస్తుంది. స్ల్పెండర్ ప్లస్ డ్రమ్, స్ల్పెండర్ ప్లస్ ఐ3 , స్ల్పెండర్ ప్లస్ ఐ 3ఎస్, బ్లాక్ అండ్ యాక్సెంట్, స్ల్పెండర్ ప్లస్ టెక్స్ టెక్ డ్రమ్ బ్రేక్, స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ డిస్క్ బ్రేక్ , స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ 2.0డ్రమ్ బ్రేక్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ. 79, 096 ఉండగా హైఎండ్ వేరియంట్ ధర రూ. 86.,051గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 వెహికల్స్ తో ఈ స్ప్లెండర్ పోటీ పడుతోంది.






