మరదలితో మైనర్ బాలుడి ప్రేమ.. ఆమె అలా చేసిందని ఇంట్లోనే..

by  |
మరదలితో మైనర్ బాలుడి ప్రేమ.. ఆమె అలా చేసిందని ఇంట్లోనే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆత్మహత్య చేసుకోవడం నేటి యువతకు ఫ్యాషన్ గా మారిపోయింది. చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలను తీసుకుంటున్నారు. అమ్మ కొట్టిందని, నాన్న ఫోన్ కొనివ్వలేదని, ప్రియురాలు కాదన్నదని.. ఇలా చిన్నవాటికే విలువైన నిండు ప్రాణాన్ని వదిలేస్తున్నారు. తాజాగా ఒక మైనర్ బాలుడు.. ప్రేమించిన బాలిక ప్రేమను తిరస్కరించడంతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. అరండల్‌పేట, బొంగరాలబీడు 1వ లైనుకు చెందిన నల్లమోతు ఆంథోనిబాబు (15) వసంతరాయపురంలోని మెయిన్‌ రోడ్డులో ఉన్న ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఆంథోని వరసకు మరదలయ్యే ఆమె స్నేహితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో తన ప్రేమను బాలికకు వ్యక్తపరిచాడు. కానీ ఆమె బాలుడి ప్రేమను తిరస్కరించింది. ఆమె ప్రేమను తిరస్కరించడంతో మనస్థాపానికి గురైన బాలుడు మరదలు నివాసంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాజారత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed