‘విద్యార్థులు లేకుండా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం బాధాకరం ’

by  |
‘విద్యార్థులు లేకుండా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం బాధాకరం ’
X

దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని భూర్గంపాహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాలలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం పలు ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయలలో జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈసందర్భంగా పలు అధికారులు మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించినటువంటి వ్యక్తులను ఈసందర్భంగా కొనియాడారు. అంతేకాకుండా స్వతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.

అనంతరం పలు విద్య సంస్థల చైర్మన్లు మాట్లాడుతూ… ప్రతి ఏడాది అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కొవిడ్ మహమ్మారి కారణంగా ఈవేడుకలను విద్యార్థులు లేకుండా పాఠశాలలో జరగడం బాధాకరంగా ఉందని మాట్లాడిన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిప్, పినపాక శాసనసభ సభ్యులు రేగా కాంతారావు జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈసందర్భంగా రేగా మాట్లాడుతూ…స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన మహానుబావుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలకు స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎండీఓలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed