కలుషిత నీరు తాగి 70 మందికి అస్వస్థత

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: కలుషిత నీరు తాగి 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం అయోధ్య గ్రామ పంచాయతీ పరిధిలోని భజనతండాలో పంచాయతీ సరఫరా చేసిన బావి నీరు తాగి తండావాసులు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తండావాసులు నీటిని పరీక్ష నిమిత్తం [&hellip;]</p>

కలుషిత నీరు తాగి 70 మందికి అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: కలుషిత నీరు తాగి 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం అయోధ్య గ్రామ పంచాయతీ పరిధిలోని భజనతండాలో పంచాయతీ సరఫరా చేసిన బావి నీరు తాగి తండావాసులు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తండావాసులు నీటిని పరీక్ష నిమిత్తం వరంగల్‌లోని ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.

Next Story