డబ్బు కాదు.. స్వేచ్ఛ కావాలంటున్న మిలీనియల్స్

by  |
డబ్బు కాదు.. స్వేచ్ఛ కావాలంటున్న మిలీనియల్స్
X

దిశ, ఫీచర్స్ : భారతీయ మిలీనియల్స్ ‘స్వేచ్ఛ’ గురించి ఏమనుకుంటున్నారు, వారు దానిని ఎలా వ్యక్తపరచాలని కోరుకుంటున్నారు. వారి జీవితంలో స్వేచ్ఛ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రసిద్ధ డేటింగ్ యాప్ ఓకే క్యూపిడ్(OkCupid) ఓ సర్వే నిర్వహించింది. మరి ఇందులో మతం, ప్రెస్ ఫ్రీడమ్, మనీ గురించి మిలీనియల్స్ ఏం చెప్పారో తెలుసుకుందాం.

ఓకే క్యూపిడ్ సర్వే ప్రకారం భారత మిలీనియల్స్ 90 శాతం మంది పత్రికా స్వేచ్ఛ ముఖ్యమని భావించారు. 76 శాతం మంది వినియోగదారులు మత స్వేచ్ఛను కాపాడటానికి చట్టాలు ఉండాలన్నారు. 65 శాతం మంది భారతీయులు డబ్బు కంటే ఎక్కువ స్వేచ్ఛను కోరుకోగా, 35 శాతం మంది డబ్బు కావాలన్నారు. అంతేకాకుండా 73 శాతం మంది తాము స్వతంత్ర వ్యక్తులమని, దేని గురించైనా స్వేచ్ఛగా మాట్లాడటంతో పాటు ఆలోచిస్తామని తెలిపారు. ఇక రిలేషన్‌షిప్స్ విషయానికి వస్తే 68 శాతం మంది తమ భాగస్వాములకు స్వేచ్ఛను ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. రిలేషిన్‌షిప్‌లో ఆర్థిక స్వేచ్ఛను ఆస్వాదించడానికి ఇండిపెండెంట్ బ్యాంకు అకౌంట్స్ కావాలని 73 శాతం మంది తెలపగా.. 27 శాతం మంది మాత్రం తమ భాగస్వామితో జాయింట్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండటానికి అభ్యంతరం లేదన్నారు. అలాగే 30 శాతం మంది ప్రయాణం స్వేచ్ఛగా ఉండాలని భావించారు. ఇక స్వేచ్ఛ, భద్రత విషయాల్లో ఏదీ కావాలని ప్రశ్నించగా 58 శాతం వినియోగదారులు స్వేచ్ఛను కోరుకోగా.. 42 శాతం మంది భద్రతను ఎంచుకున్నారు.


Next Story

Most Viewed