కోట్ల ఏళ్ల నాటి శిలాజాన్ని గుర్తించిన బాలుడు

by  |
కోట్ల ఏళ్ల నాటి శిలాజాన్ని గుర్తించిన బాలుడు
X

దిశ, ఫీచర్స్ : సౌత్ వేల్స్‌లోని ఒక బీచ్‌లో 220 ఏళ్ల నాటి డైనోసార్ పాదముద్రను నాలుగేళ్ల బాలిక లిలీ విల్డర్ ఇటీవలే కనుగొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌కు చెందిన భారత సంతతి చిన్నోడు సిద్ధాఖ్ సింగ్ జామత్‌కు కొన్ని మిలియన్ ఏళ్ల కిందటి శిలాజాలు దొరికాయి.

సిద్ధాఖ్ తమ తోటలో ఆడుకోవడానికి వెళ్లాడు. ఆ ఆరేళ్ల పిల్లోడి దగ్గర శిలాజాల అన్వేషణకు ఉపయోగపడే కిట్‌ ఉండగా, దాంతో తమ తోటలో శోధించడం మొదలుపెట్టాడు. కుండలు, మట్టి పాత్రలు, ఇటుకల వంటి వాటి కోసం అతడు భూమిని తవ్వుతుండగా, ఆ సమయంలో ఏదో కొమ్ములాంటి ఆకారం సిద్దాఖ్‌కు కనిపించింది. ముందుగా అది ఓ జంతువుకు సంబంధించిన దంతం లేదా కొమ్ము అనుకున్నాడు. కానీ ఆ చిన్నోడికి అనుమానం వచ్చి, తన తండ్రికి దాన్ని చూపించగా, అదొక పగడపు దిబ్బ భాగమని తెలిసింది. దానిని హర్న్ కోరల్ అని పిలుస్తారు.

సిద్ తండ్రి విష్ సింగ్ ఫేస్‌బుక్‌లో ఓ శిలాజాల గ్రూపులో మెంబర్‌గా ఉన్నాడు. అతడి ద్వారే సిద్‌కు దొరికిన శిలల గురించి వెలుగులోకి వచ్చింది. ఆ శిలాజాలు దాదాపుగా 251 నుంచి 500 మిలియన్ ఏళ్ల కిందటివని తెలుస్తోంది. అవి లభించిన చోట భారీగా సముద్ర నత్తలు, స్వ్కిడ్ వంటి వాటిని కూడా సిద్ కనుగొన్నాడని విష్ సింగ్ తెలిపాడు.


Next Story

Most Viewed