స్ట్రెస్‌లో భారత ఉద్యోగులు.. హెల్త్‌పై తీవ్ర ప్రభావం.. సర్వేలో విస్తుపోయే నిజాలు

116

దిశ, వెబ్‌డెస్క్ : మార్ష్ ఇండియా సర్వే నివేదిక ప్రకారం దేశంలో 59% మంది ఉద్యోగులు రోజువారీ ఒత్తిడికి గురవుతున్నట్లు నివేదించింది. సోమవారం విడుదల చేసిన హెల్త్ ఆన్ డిమాండ్ ఇండియా 2021 సర్వే నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మంది ఉద్యోగులు, ఆసియాలో 51 శాతం మంది ఉద్యోగులు తమ రోజువారీ జీవితంలో ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ప్రపంచ సగటు సర్వే కన్నా భారత సగటు ఎక్కువగా ఉండటం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా 13 దేశాలలో 14,000 మంది ఉద్యోగులను వారి ఆరోగ్యం, శ్రేయస్సు వంటి అంశాలపై సర్వే చేసింది. దేశంలోని ప్రతీ ఐదుగురిలో ముగ్గురు ఉద్యోగులు (59 శాతం) దైనందిన జీవితంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపింది. అయితే.. కొవిడ్ అనంతరం ఉద్యోగులపై మరింత ఒత్తిడి పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 33 శాతం మంది ఉద్యోగుల జీవితాలపై కొవిడ్‌ మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. ఒత్తిళ్లను తగ్గించుకునేందుకు యజమానుల నుంచి ఎలాంటి సహకారం లేదని 44 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగుల శ్రేయస్సు పట్ల యజమానుల శ్రద్ధ ఉందనేవారి సంఖ్య 2019లో 58 శాతం ఉండగా, 2021లో అది 46 శాతానికి పడిపోయింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..