- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
50మంది ట్రైనీ పోలీసులకు పాజిటివ్
<p>దిశ,బోధన్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో గల పోలీస్‌ట్రైనింగ్ సెంటర్లో 50 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 10రోజుల కిందట 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొందరికీ స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని వారం కిందట నిజామాబాద్‌లోని జీజీహెచ్‌కు తరలించి కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో ఏకంగా 11మంది ట్రైనీ పోలీసులకు కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15కు చేరింది. అలాగే, తాజాగా మరికొందరికీ కరోనా […]</p>

దిశ,బోధన్:
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో గల పోలీస్‌ట్రైనింగ్ సెంటర్లో 50 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 10రోజుల కిందట 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొందరికీ స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని వారం కిందట నిజామాబాద్‌లోని జీజీహెచ్‌కు తరలించి కరోనా టెస్టులు నిర్వహించారు.
అందులో ఏకంగా 11మంది ట్రైనీ పోలీసులకు కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15కు చేరింది. అలాగే, తాజాగా మరికొందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా 35 మంది ట్రైనీ కానిస్టేబుల్‌లకు కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో ట్రైనింగ్ సెంటర్‌లో మొత్తం 50 కరోనా కేసులు వెలుగు చూశాయి. పాజిటివ్ వచ్చిన అందరికీ ప్రత్యేక గదులు కేటాయించడం సాధ్యం కాకపోవడంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరిగినట్లు తెలుస్తోంది. సైబారాబాద్ జోన్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుళ్లకు సైతం ప్రస్తుతం అక్కడ శిక్షణ ఇస్తుండటంతో వారు భయాందోళనకు గురవుతున్నారు.






