బీఆర్ఓలో 459 ఖాళీలు

by  |
బీఆర్ఓలో 459 ఖాళీలు
X

రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బొర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ), జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్(జీఆర్ఈఎఫ్) విభాగంలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 459

డ్రాఫ్ట్ మ్యాన్‌: 43 ఖాళీలు

అర్హత: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు ఆర్కిటెక్చర్/డ్రాఫ్ట్ మ్యాన్‌షిప్‌లో రెండేండ్ల సర్టిఫికెట్ కోర్సు లేదా డ్రాఫ్ట్‌మ్యాన్(సివిల్) సబ్జెక్టులో రెండేండ్ల నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్‌తోపాటు సంబంధిత ట్రేడులో ఏడాదిపాటు ప్రాక్టికల్ అనుభవం.

సూపర్‌వైజ‌ర్ స్టోర్: 11 ఖాళీలు

అర్హత: బ‌్యాచిల‌ర్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. మెటీరియల్ మేనేజ్‌మెంట్/ ఇన్వెంటరీ కంట్రోల్/ స్టోర్స్ కీపింగ్ కోర్సుల్లో సర్టిఫికెట్ ఉండాలి.
రేడియో మెకానిక్: 4 ఖాళీలు

అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. ఇండస్ట్రీయల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి రేడియో మెకానిక్ సర్టిఫికెట్‌తోపాటు రెండేళ్లు రేడియో మెకానిక్‌గా పనిచేసిన అనుభవం.
ల్యాబ్ అసిస్టెంట్: 1 ఖాళీ

అర్హత: ఇంటర్(10+2) ఉత్తీర్ణత. ఇండస్ట్రీయల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన ల్యాబొరేటరీ అసిస్టెంట్ సర్టిఫికెట్ ఉండాలి.

స్టోర్ కీపర్(టెక్నికల్): 150 ఖాళీలు

అర్హత: ఇంటర్‌/తత్సమాన ఉత్తీర్ణత. వెహికిల్స్/ ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంట్‌కు సంబంధించిన స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ ఉండాలి.

మల్టీ స్కిల్డ్ వర్కర్(మాసన్): 100 ఖాళీలు

అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. బిల్డింగ్ క‌న్‌స్ట్రక్షన్/ బ్రిక్స్ మాసన్‌లో ఇండస్ట్రీయల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన సర్టిఫికెట్ ఉండాలి.

మల్టీ స్కిల్డ్ వర్కర్(డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్): 150 ఖాళీలు

అర్హత: మెట్రిక్యులేషన్/ తత్సమాన ఉత్తీర్ణత. మెకానిక్ మోటార్/ వెహికిల్స్/ ట్రాక్టర్స్ విభాగాల్లో ఇండస్ట్రీయల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు: మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టుల‌కు 18-25ఏండ్ల మధ్య మిగ‌తా పోస్టుల‌కు 18-27ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్(ట్రేడ్ టెస్ట్), రాత పరీక్ష ద్వారా
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి ప్రక్రియ ఫిజికల్ & ఏఎంపీ; ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్‌ల‌కు ఎంపిక చేస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు జీఆర్ఈఎఫ్ సెంటర్, పుణెలో ట్రెయినింగ్‌కు పంపిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో

చివరి తేదీ: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45రోజుల్లోపు

చిరునామా: Commandant GREF Centre, Dighi camp, Pune- 411 015

వెబ్‌సైట్‌: http://www.bro.gov.in



Next Story