చాక్లెట్ ఆశ చూపి చిన్నారిని లోనికి తీసుకెళ్లిన కామాంధుడు.. భయంతో పరుగులు తీయడంతో..!

by  |
చాక్లెట్ ఆశ చూపి చిన్నారిని లోనికి తీసుకెళ్లిన కామాంధుడు.. భయంతో పరుగులు తీయడంతో..!
X

దిశ, చార్మినార్​ : చాక్లెట్​ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని స్థానికులు అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన నగరంలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్​పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది.ఇన్‌స్సెక్టర్ సయ్యద్​అబ్దుల్ ఖాదర్​జిలానీ కథనం ప్రకారం.. అశోక్​నరగ్‌కు చెందిన నర్సింగ్​రావు(32) పీకల దాకా మద్యం సేవించాడు.

ఉప్పుగూడ క్రాంతి నగర్లో తన ఇంటి ముందు ఒంటరిగా అడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిపై కామాంధుడి కన్నుపడింది. చాక్లెట్​ఇప్పిస్తానని ఆశ పెట్టి పక్కకు తీసుకువెళ్లి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక భయపడి పరుగులు తీస్తూ వెళ్ళి కుటుంబ సభ్యులకు చెప్పింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించిన నర్సింగ్​రావును స్థానికుల సాయంతో పట్టుకుని కుటుంబ సభ్యలు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed