జగదేకవీరుడు అతిలోకసుందరి: నాని చెప్పిన తొలి కథ

by  |
జగదేకవీరుడు అతిలోకసుందరి: నాని చెప్పిన తొలి కథ
X

జగదేకవీరుడు అతిలోకసుందరి .. బ్లాక్ బస్టర్ లు ఎన్నొచ్చినా ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో ముందుండే చిత్రం. సినిమా చూసే.. సినిమా తీసే.. విధానాన్ని మార్చిన ఈ సినిమా విడుదలై మే 9కి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ ఇందుకు సంబంధించిన రహస్యాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. అసలు సినిమా ఎలా మొదలైంది? జగదేక వీరుడుగా మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరిగా శ్రీదేవిని ఎలా ఎంచుకున్నారు? అసలు కథకు ఊహా కల్పన ఇచ్చింది ఎవరు? దీన్ని పూర్తి చేసింది ఎవరు? అనేది నేచురల్ స్టార్ నాని తన వాయిస్ ద్వారా వినిపించారు.

ఎన్టీఆర్ జగదేకవీరుని కథ సినిమా చూశాక నిర్మాత సి.అశ్వినీదత్ కు తన బెస్ట్ ఫ్రెండ్ చిరంజీవితో ఎప్పటికైనా అలాంటి ఫాంటసీ మూవీ తీయాలని నిర్ణయించుకున్నారట. దీనికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అయితేనే కరెక్ట్ అనుకున్నారట. ఆఖరిపోరాటం తర్వాత చిరుతో సినిమా అనుకున్న అశ్వనీదత్… తన ఫ్రెండ్ కో డైరెక్టర్, రచయిత శ్రీనివాస్ చక్రవర్తిని డైరెక్టర్ రాఘేంద్రరావుతో తిరుమలకు పంపించారట. వీరిద్దరు తిరుమల కొండపై ఉండగా శ్రీనివాస్ చక్రవర్తి.. దేవకన్య భూమి మీదకు వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది.. అది చిరంజీవికి దొరుకుతుంది.. అని స్టోరీ లైన్ చెప్పగా.. రాఘవేంద్ర రావుకు చాలా నచ్చిందట. దత్ కలకు దగ్గరగా ఉన్న స్టోరీ లైన్ ఆయనకు కూడా నచ్చడంతో… మరి జగదేక వీరుడికి జోడీగా అతిలోక సుందరి ఎవరూ అనేది అందరిలో మెదిలిన ప్రశ్న. వెంటనే అందరికీ ఒకరే కనిపించారు.. వైజయంతి ఆస్థాన కథానాయిక, వెండితెర దేవత శ్రీదేవి. క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఇందుకు తగిన కథను సెట్ చేయడానికి వైజయంతి ఆఫీసులో రచయితల కుంభమేళ ప్రారంభమైంది. యండమూరి వీరేంద్రనాథ్, జంధ్యాలతో మొదలై సత్యమూర్తి, విజయేంద్ర ప్రసాద్, క్రేజీ మోహన్ లు అంతా కలిసి కథ సిద్దం చేసేందుకు సన్నద్ధం అయ్యారు. నెలరోజుల పాటు చిరంజీవి కూడా ఆఫీస్ కి వెళ్లి తన సలహాలు అందించారు. అతిలోక సుందరి అందంగా కనిపించాలంటే నేను మాసిన గడ్డంతో కనబడడం మంచిదని చెప్పారట చిరు. శ్రీదేవి ముంబైలో తన కాస్ట్యూమ్స్ డిజైన్ తానే చేసుకుంటూ సపోర్ట్ చేసిందట.అందరూ కలిసి తెలుగు చిత్ర సీమకు అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందించారు.

అయితే చరిత్ర సృష్టించిన ఈ సినిమా అంత తొందరగా తెరమీదకి రాలేదు మానవా.. తెర వెనుక చాలా జరిగాయి.. అవన్నీ తెలుసుకోవాలంటే స్టే టూన్ అని చెప్పిన నాని… మరో కథతో రాబోతున్నారు.



Next Story