- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఫ్లాష్ ఫ్లాష్ : రద్దీ మార్కెట్‌లో భారీ పేలుడు.. 30 మంది మృతి
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఉగ్రమూకలు మరోసారి తమ ఉన్మాదాన్ని ప్రదర్శించాయి. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని రక్తపుటేర్లు పారించాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగర శివారులో సంభవించిన బాంబు పేలుడులో సుమారు 30 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. పవిత్రమైన బక్రీద్(ఈద్-అల్-అదా) పండుగ నేపథ్యంలో జనం రద్దీగా ఉండే మార్కెట్ ఏరియాలో ఉగ్రవాదులు బాంబు పేల్చారు.
సోమవారం జరిగిన ఈ ఘటనతో బాగ్దాద్ నగరం ఒక్కసారిగా దద్దరిల్లింది. రద్దీ మార్కెట్లలో బాంబు పేలుడు సంభవించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి అని అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా ప్రస్తుత పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.
Advertisement
Next Story