బీజేపీ నాయకురాలి పై 30 కేసులు

24

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నాయకురాలు కుష్బు సుందర్‌ పై తమిళనాడులో ఏకంగా 30 కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన కుష్భు ఆ పార్టీ నేతల పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మానసిక వికలాంగులు అంటూ కాంగ్రెస్ నేతలు అంటూ పోల్చారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్‌పీఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ వికలాంగుల మనోభావాలను కించపరిచే విధంగా పోల్చుతూ వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 30 స్టేషన్లలో ఫిర్యాదు అయినట్టు ఎన్‌పీఆర్‌డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ చెప్పారు.