- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ముగ్గురి అరెస్టు..
<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ముగ్గురు నిందితులను సోమవారం ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అందులో జనరల్ మేనేజర్ సుదర్శన్, చీఫ్ ఆపరేటర్ రాజగోపాల్ రావు, సైట్ మేనేజర్ వెంకటేశ్‌లు ఉన్నారు. వీరి నిర్లక్ష్యం వల్లే కరోనా బాధితులు అగ్నికి ఆహుతయ్యారని తెలుస్తోంది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దేశ ప్రధానితో పాటు పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం ఈ ప్రమాదంపై స్పందించారు. దీనిని సీరియస్‌గా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ముగ్గురు నిందితులను సోమవారం ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అందులో జనరల్ మేనేజర్ సుదర్శన్, చీఫ్ ఆపరేటర్ రాజగోపాల్ రావు, సైట్ మేనేజర్ వెంకటేశ్‌లు ఉన్నారు. వీరి నిర్లక్ష్యం వల్లే కరోనా బాధితులు అగ్నికి ఆహుతయ్యారని తెలుస్తోంది.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దేశ ప్రధానితో పాటు పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం ఈ ప్రమాదంపై స్పందించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ లేకపోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.
దీంతో ఆ ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కాగా, విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది వరకు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Next Story






