రాష్ట్రంలో కరోనా విజృంభణ… కొత్తగా @2892

11

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,589కి చేరింది. కాగా నిన్న ఒక్కరోజే కరోనాతో పది మంది మృతిచెందారు.

దీంతో మొత్తం మృతుల సంఖ్య 846కి చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 32,341 చేరింది. ఇప్పటివరకూ వైరస్ బారిన పడి 97,402 డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 477 కేసులు నమోదు కాగా, మొత్తం 51,623కు చేరాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.