రాష్ట్రంతో కొత్తగా 2,511 పాజిటివ్ కేసులు

7

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,511 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ మూలంగా 11 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,38,395 కు చేరాయి.

ఇప్పటివరకూ 877 మంది మృత్యువాత పడ్డారు. మహమ్మారి బారిన పడి ఆసుపత్రుల్లో 32,915 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్ నుంచి కోలుకుని ఇప్పటివరకూ 1,04,603 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 305 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 52,647కు చేరాయి.