- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లకండి.. స్టార్ హీరోకు ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాల్లోని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా చూసే ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ మరో రెండ్రోజుల్లో జరుగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్ గ్రౌండ్‌లో నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం కేవలం క్రికెట్ అభిమానులే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లొద్దంటూ బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్‌కు ఫ్యాన్స్ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు. బిగ్ బీ మ్యాచ్‌కి వెళ్లినా, టీవీల్లో వీక్షించినా తప్పక ఓడిపోతుందని కామెంట్లు పెడుతున్నారు. తాజాగా.. ఈ పోస్టులపై అమితాబ్ కూడా స్పందించారు. ఫ్యాన్స్ వార్నింగ్‌లకు ఫన్నీగా సమాధానం చెప్పారు. తాను మ్యాచ్‌కి వెళ్లకపోతే తప్పకుండా ఇండియా గెలుస్తుంది. అందుకే ఏం చేయాలో అర్ధం కావడం లేదు. దీనిపైనే ఆలోచిస్తున్నా. అని రిప్లై ఇచ్చారు. ఆయన స్పందనను ఫ్యాన్స్ కూడా ఫన్నీగా తీసుకొని రీపోస్టులు చేస్తున్నారు.