ICC World Cup 2023: ఆసీస్ భారీ స్కోరు.. పాక్ టార్గెట్ ఇదే

by Disha Web Desk 13 |
ICC World Cup 2023: ఆసీస్ భారీ స్కోరు.. పాక్ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కంగారూలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (124 బంతుల్లో 163, 14 ఫోర్లు, 9 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (108 బంతుల్లో 121, 10 ఫోర్లు, 9 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా.. 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాకిస్తాన్‌ బౌలర్లలో షహీన్‌ షా అఫ్రిది మినహా మిగిలినవారంతా తేలిపోయారు. ముఖ్యంగా ఉసామా మిర్‌, హరీస్‌ రౌఫ్‌లు అయితే ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. షహీన్‌ షా అఫ్రిది 5 వికెట్లు పడగొట్టాడు. పాక్ బౌలర్‌లో షాహీన్ అఫ్రిది 5 వికెట్లు తీయగా.. హరీస్ రవూఫ్ 3, ఉసామా మీర్ 1 వికెట్లు పడగొట్టారు.


Next Story