- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసిస్టెంట్ కలెక్టర్లుగా 2020 బ్యాచ్ ట్రెయినీ ఐఏఎస్ లు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో 2020 బ్యాచ్ కు చెందిన పలువురు అండర్ ట్రెయినీ ఐఏఎస్ లను అసిస్టెంట్ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వారికి పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. మయాంక్ మిట్టల్ ను కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా కేటాయించారు. అపూర్వ్ చౌహాన్ ను నల్లగొండ జిల్లాకు, అభిషేక్ అగస్త్యను మహబూబాబాద్ కు, మంద మకరంద్ ను నిజామాబాద్ కు, […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో 2020 బ్యాచ్ కు చెందిన పలువురు అండర్ ట్రెయినీ ఐఏఎస్ లను అసిస్టెంట్ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వారికి పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. మయాంక్ మిట్టల్ ను కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా కేటాయించారు.
అపూర్వ్ చౌహాన్ ను నల్లగొండ జిల్లాకు, అభిషేక్ అగస్త్యను మహబూబాబాద్ కు, మంద మకరంద్ ను నిజామాబాద్ కు, అశ్విని తానాజీ వాకడే ను మెదక్, బీ రాహుల్ ను ఖమ్మం, ప్రతిభ సింగ్ ను మంచిర్యాల, ప్రఫుల్ దేశాయ్ ను సిద్దిపేట, పీ కధిరావణ్ ను నిర్మల్ జిల్లాకు కేటాయించారు. సంబంధిత కలెక్టర్, మెజిస్ట్రేట్ వీరికి సంబంధించిన రిపోర్టులు, అసెస్ మెంట్ రిపోర్టులు ప్రభుత్వానికి నివేదికగా పంపించాలని సీఎస్ పేర్కొన్నారు.
- Tags
- cs somesh kumar
Next Story






