ఢీకొన్న రెండు బస్సులు.. 16 మంది మృతి

104

దిశ, వెబ్ డెస్క్ : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్న ఘటనలో 16 మంది గని కార్మికులు మృతి చెందారు. మెక్సికోలోని సోనోరాలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడ్డారు.

ఈరోజు తెల్లవారుజామున నోషీ బ్యుయెనా గనికి చెందిన ఉద్యోగులను తరలిస్తుండగా రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఒక బస్సు ఘోరంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రెండు బస్సులు అతివేగంతో ఉండటంతో.. చనిపోయిన వారంతా ఆ బస్సులోనే చిక్కుకుపోయారు. కార్మికులు కాబోర్కాకు దగ్గర్లో ఉన్న ఓ బంగారు గనిలో పని చేస్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..