పిడుగుతో సెల్ఫీ ట్రై చేశారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

by  |
lightning strike
X

దిశ, వెబ్‌డెస్క్ : సెల్ఫీ అత్యుత్సాహం వారి ప్రాణాలను బలి తీసుకుంది. వర్షం పడుతున్న సమయంలో పిడుగును సెల్ఫీ తీసుకుందామనుకున్న ఘటనలో 16 మంది మృతి చెందారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జైపూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం వర్షం కురుస్తుండగా జైపూర్‌లోని అమర్ ప్యాలెస్‌‌ను సందర్శిస్తున్న వాళ్లలో కొందరు ఆనందంతో క్లాక్‌టవర్‌పైకి ఎక్కారు. ఈ క్రమంలో వారంతా సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.

అదే సందర్భంలో సడెన్‌గా టవర్‌పై పిడుగుపడింది. పిడుగు పడిన సెకన్ల వ్యవధిలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందారు. పిడుగు పడిందన్న కంగారులో కొందరు టవర్ పక్కనే ఉన్న హిల్‌ స్టేషన్ ఫారెస్ట్‌లోకి జంప్ చేశారు. ఈ క్రమంలో మరికొంత మంది చనిపోయారు. ఇక, ఈ ఘటనలో ఇప్పటిదాకా 16 మంది మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉండటం విషాదం. అయితే, ఈ ప్రమాదంతో మరో 29 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.


Next Story

Most Viewed