వృద్ధుల కోసం ‘జీపీఎస్ వాకింగ్ స్టిక్’

by  |
వృద్ధుల కోసం ‘జీపీఎస్ వాకింగ్ స్టిక్’
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి సమస్య నుంచి ఓ కొత్త ఇన్నోవేషన్ పుట్టుకొస్తుంది. అందుకు మన నిత్యజీవితంలో జరిగిన సంఘటనలు లేదా సమాజంలోని ప్రాబ్లమ్స్ ప్రేరణగా నిలుస్తాయి. అలా పెద్దపల్లికి చెందిన 14 ఏళ్ల అంజలికి ఎదురైన ఓ అనుభవం.. తను ‘జీపీఎస్ వాకింగ్ స్టిక్’ రూపొందించడానికి కారణమైంది.

‘గత సంవత్సరం మా ఇంటి పక్కన నివసించే ఓ తాత.. ఈవెనింగ్ వాక్‌కు వెళ్లి అక్కడే పట్టుతప్పి పడిపోయాడు. అరగంట పాటు రోడ్డు మీదనే అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ తాతను ఆస్పత్రికి లేటుగా తీసుకెళ్లడంతో చనిపోయాడు. కాస్త ముందుగా తీసుకొని వచ్చుంటే ఆయన ప్రాణాలు దక్కేవని డాక్టర్లు చెప్పారు. ఆ మాటలు నన్ను కదిలించాయి. ఆ సంఘటన చూసినప్పటి నుంచి ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏంటనే ఆలోచనలు మొదలయ్యాయి. అలా జీపీఎస్ ఆధారిత మల్టీ పర్సస్ వాకింగ్ స్టిక్ ఐడియా వచ్చింది. ఆ ఆలోచనను నా ఫ్రెండ్స్ వ్యాషిలిని, హర్షితలతో కలిసి పంచుకోగా, మా టీచర్లు కూడా ఆ ప్రాజెక్ట్‌కు సాయం చేశారు. మేమంతా నాలుగు నెలలు కష్టపడి, మల్టీ పర్సస్ వాకింగ్ స్టిక్‌ను రూపొందించాం. ఇది కేవలం వాకింగ్ స్టిక్‌లానే కాకుండా, ఫోల్డింగ్ చెయిర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. చీకట్లోనూ దారి కనిపించేందుకు లైట్లు అమర్చాం. వృద్ధులు, మానసిక వికలాంగులు ఎక్కడైనా చిక్కుకున్నా, పడిపోయినా ఫ్యామిలీ మెంబర్స్‌కు అలర్ట్ వెళ్తుంది. జీపీఎస్ సాయంతో వాళ్లు ఎక్కడున్నా వెంటనే కనిపెట్టొచ్చు’ అని అంజలి తెలిపింది.

Next Story

Most Viewed