మాస్క్ ధరించని 12వందల మంది పై జరిమానా …

172

దిశ,జగిత్యాల: జిల్లావ్యాప్తంగా మాస్కులు ధరించంచని 12 వందల మంది పై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి, ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయల జరిమాన విధించినట్లు, నిబంధనలు పాటించని షాపింగ్ మాల్స్, హోటల్స్, దుకాణాల సముదాయాల పై 62 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సింధుశర్మ వెల్లడించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న వారిని కోవిడ్ నిబంధనల ప్రకారం జరిమాన విధించడంతో పాటు కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. కరోనాను నియంత్రించడంలో భాగంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని కోరారు.

షాప్ కు వచ్చే ప్రతి కస్టమర్ కు మాస్కులు తప్పని సరిగా ధరించే విధంగా చూడాలన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాస్కుల ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను సైతం చేస్తున్నామని, కరోనా నిబంధనల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నామని పేర్కొన్నారు. మాస్క్ ధరించని వారికి ‘” డిసాస్టర్ మేనేజ్మెంట్ ఏసిటీ సెక్షన్ 51(బి)” ప్రకారం వెయ్యి రూపాయల జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు. దుకాణాల వద్ద నిబంధనలు పాటించని వారి పైన దుకాణాల యజమాన్యం పైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..