- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదేండ్లు సీఎంగా నేనే ఉంటా : కేసీఆర్
<p>దిశ, వెబ్‌డెస్క్ : కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు పలు మీడియా సంస్థలు అదే పనిగా రాత్రింబవళ్లు చేసిన ప్రచారానికి ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని కుండబద్దలు కొట్టారు. ఆదివారం తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే మూడేండ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉండనున్నట్లు తెలిపారు. దీంతో తనయుడు కేటీఆర్ సీఎం […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు పలు మీడియా సంస్థలు అదే పనిగా రాత్రింబవళ్లు చేసిన ప్రచారానికి ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని కుండబద్దలు కొట్టారు. ఆదివారం తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే మూడేండ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉండనున్నట్లు తెలిపారు. దీంతో తనయుడు కేటీఆర్ సీఎం అవుతాడని టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఇన్నిరోజులుగా చేస్తున్న ప్రచారానికి ఒక్కసారిగా తెరదించారు.
అంతేకాకుండా కేటీఆర్ సీఎం అంటూ ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలకు తలంటినట్లు తెలుస్తోంది. మొత్తంగా పదేండ్లు తానే ముఖ్యమంత్రిని అని.. గీత దాటి మాట్లాడితే చర్యలు తప్పవని మీటింగ్ సందర్భంగా హెచ్చరించినట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో 6లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. అందుకు ఏ జిల్లా ముందుకు వస్తే అక్కడే సభ నిర్వహిస్తానన్నారు. అంతేకాకుండా ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు నమోదు చేయించాలని టార్గెట్ విధించినట్లు తెలుస్తోంది.






