మొత్తం 10 మంది కొవిడ్ బాధితులు మృతి : ఆళ్ల నాని

by  |
మొత్తం 10 మంది కొవిడ్ బాధితులు మృతి : ఆళ్ల నాని
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ అగ్నిప్రమాదంపై మంత్రుల సమీక్ష ముగిసింది. మంత్రులు సుచరిత, ఆళ్ల నాని, వెల్లంపల్లి, పేర్ని నాని, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కొవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. మొత్తం 10 మంది కొవిడ్ బాధితులు మృతిచెందారని, అందులో ముగ్గురు మహిళలు ఉన్నారన్నారని పేర్కొన్నారు.

ఉదయం 4.45 గంటలకు ప్రమాదం జరిగిందన్నారు. సమాచారం అందిన వెంటనే 5.13 కల్లా ఫైర్ సిబ్బంది స్పాట్ కు వెళ్లి 18 మందిని వెంటనే రెస్క్యూ చేశారని మంత్రి చెప్పారు. 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలిన ఆరుగురు సురక్షితంగా ఇంటికి వెళ్లారని ఆయన చెప్పారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఒక కమిటీ, అగ్నిప్రమాదానికి కారణాలపై అధ్యయన మరో కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీలకు ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.



Next Story

Most Viewed