‘ఇండియా వర్సెస్ పాక్‌’కు చరమగీతం

by  |
‘ఇండియా వర్సెస్ పాక్‌’కు చరమగీతం
X

ఢిల్లీ ఎన్నికలను ఇండియా వర్సెస్ పాకిస్థాన్‌గా పోలుస్తూ వివాదాస్పద ట్వీట్ చేసిన బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా గుర్తున్నారా? ఈ ట్వీట్ చేసినందుకు 48 గంటలపాటు ప్రచారాలపై నిషేధమే కాదు.. ఎఫ్ఐఆర్‌ కూడా నమోదైంది. ఇండియా వర్సెస్ పాక్ మాత్రమే కాదు.. దేశద్రోహులను కాల్చి చంపాలన్న వివాదాస్పద నినాదాన్ని పలికారు. కానీ, కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలను ఢిల్లీ ప్రజలు ఆహ్వానించలేదని స్పష్టమైంది. మాడల్ టౌన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కపిల్ మిశ్రా.. ఆప్ అభ్యర్థి అఖిలేశ్ పాటి త్రిపాఠిపై 10 వేల ఓట్ల తేడాతో మట్టికరిచారు. ఫలితాల అనంతరం నెటిజన్లు మిశ్రా చేసిన ‘ఇండియా వర్సెస్ పాక్’ ట్వీట్ పై వ్యంగ్యోక్తులు విసిరారు. ఆప్ రెబల్ నేత అయిన మిశ్రా.. ఫలితాలకు ముందు బీజేపీ విజయం తథ్యమని, కేజ్రీవాల్ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఫలితాల అనంతరం, ప్రజలను చేరువకావడంతో బీజేపీ వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు. ఘన విజయం సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story

Most Viewed