ట్రైనర్ అవకాశాలను కల్పిస్తున్న ‘ట్రైనర్ సెంట్రల్’

by  |
ట్రైనర్ అవకాశాలను కల్పిస్తున్న ‘ట్రైనర్ సెంట్రల్’
X

దిశ, ఫీచర్స్: ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సబ్జెక్ట్‌లో లోతైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అది సంగీతం, యోగా, మ్యాథ్స్, ఆర్ట్ ఏదైనా కావచ్చు. ఆ నాలెడ్జ్‌ను పదిమందితో షేర్ చేసుకోవాలనుకునే ఔత్సాహికుల కోసం జోహో కార్పొరేషన్ ‘Trainer Central’ ప్రారంభించింది. మీ నైపుణ్యాలను లెర్నర్స్‌తో సజావుగా పంచుకునేందుకు ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. లాక్‌డౌన్ కాలంలో ఎడ్‌టెక్ పరిశ్రమ అపారమైన ఆదరణ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడం, సబ్‌స్క్రిప్షన్స్ పొందడం కాస్త కఠినమైన పనే. దాన్ని సులువు చేసేందుకు ‘ట్రైనర్‌ సెంట్రల్’ వేదికగా నిలుస్తుందని జోహో చెబుతోంది.

కంటెంట్‌ను రూపొందించేందుకు ట్రైనర్స్, క్రియేటర్స్‌కు సరైన సాధనాలు అవసరం. ఆన్‌లైన్ వ్యాపారాన్ని సెటప్ చేయాలనుకునే వారికి వెబ్‌సైట్, టికెటింగ్ పరిష్కారం, కోర్సు, వెబ్ కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ వంటి టూల్స్ సెటప్ చేసుకోవాల్సిన అవసరముంటుంది. కొంతమంది వెబ్‌సైట్ నిర్వహించేందుకు ఇష్టపడకుండా, సరళమైన మార్గాన్ని చూసుకోవాలని భావిస్తారు. అలాంటి వారికి వ్యాపారాన్ని సులువుగా ఓపెన్ చేసేందుకు ‘ట్రైనర్ సెంట్రల్’ వేదికగా పనిచేస్తుంది.

సొంత వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ నుంచి బిజినెస్ ట్రాకర్, మార్కెటింగ్ టూల్‌కిట్ వరకు ప్రతీది అందిస్తోంది జోహో. ‘Trainer Central’ అనేది పూర్తిగా నో-కోడ్ ప్లాట్‌ఫామ్ కాగా తమ కోర్సులను సృష్టించిన తర్వాత వారు వాటిని అంతర్ నిర్మిత మార్కెటింగ్ టూల్‌కిట్‌తో మార్కెట్ చేసుకోవచ్చు. ట్రైనర్స్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, ప్లాట్‌ఫామ్‌లో పీర్ డిస్కషన్స్, కోహోర్ట్-బేస్డ్ కోర్సులు, CRM టూల్స్, మరిన్ని భాషలకు యాక్సెస్ పొందుతారు. ప్రస్తుతం ఇది తమిళం, ఆంగ్లంలో అందుబాటులో ఉంది. వీటన్నింటికీ మీరు కేవలం ఏడాదికి రూ.1000 చెల్లిస్తే చాలు.

కోర్సులు కర్రికులమ్ బేస్డ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ జర్నలిజం నుండి గిటార్ పాఠాల వరకు ఏదైనా కనుగొనవచ్చు. ప్లాట్‌ఫామ్‌లో శిక్షకుడిగా ఉండేందుకు మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేకపోగా.. ట్రైనర్ అర్హతను చెక్ చేయడం లేదు కూడా. ఇది ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య ఏర్పడిన ట్రస్ట్ ఆధారంగా ఆయా ప్లాట్‌ఫామ్స్ ఆదరణ పొందుతాయి. ట్రైనర్స్ చాలామంది ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య డెస్క్‌టాప్ యాక్సెస్ లేకపోవడం. అందువల్ల మొబైల్ ఫోన్‌తో కూడా వారు తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు.

Next Story

Most Viewed