సర్పంచ్‌లు ఎవరు అలాంటి పనులు చేయకూడదు..

by  |
swathi
X

దిశ, చింతలపాలెం: చింతలపాలెం మండల కేంద్రంలోని అడ్లూరు గ్రామ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సోమవారం చింతలపాలెం మండల ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా పరిషత్ అధికారులు సుమారు 3 గంటల పాటు విచారణ చేపట్టారు. ఈ విచారణలో సర్పంచ్ కందుకూరు స్వాతి తెలిపిన వివరాల ప్రకారం.. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా మాకు 6,81,960 రూపాయలు నిధులు రావాల్సి ఉందని జిల్లా అధికారులకు తెలియజేసింది. జిల్లా పరిషత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్పంచ్ స్వాతికి ఎం‌బీ రికార్డుల ప్రకారం 1,76,215 రూపాయలు రావాల్సి ఉందని, అదేవిధంగా సర్పంచ్ దగ్గర ఎంబీలూ లేకుండా బిల్లుల ఓచర్స్ ద్వారా 5,05,045 రూపాయలు రావాల్సి ఉందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది.

దీనిపై సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా సర్పంచులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకు వస్తే వాటిని మేం పరిష్కరిస్తామని తెలిపారు. అంతేకాకుండా సర్పంచ్‌లు ఎవరు కూడా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. అడ్లూరు గ్రామ పంచాయతీ నిధుల విషయంలో రెండు నెలల్లో పూర్తి స్థాయిలో నివేదిక వెల్లడించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ విచారణలో జడ్పీ సీఈఓ సురేష్, డీపీఓ యాదయ్య, యంపీడీఓ గ్యామ, ఎంపీవో మౌలానా,ఎంపీపీ వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ పోల్నేడి శ్రీనివాస రావు, అడ్లూరు గ్రామ కార్యదర్శి అవినాష్, సర్పంచులు కందుకూరు గురవయ్య, స్వాతి పాల్గొన్నారు.


Next Story

Most Viewed