ఔను వాళ్లిద్దరూ అమ్మాయిలు.. సహజీవనం చేస్తున్నారు

by  |
ఔను వాళ్లిద్దరూ అమ్మాయిలు.. సహజీవనం చేస్తున్నారు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న సంఘటనల గురించి ఈమధ్య మనం వింటూనే ఉన్నాం. అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. మధురైలో ఇద్దరమ్మాయిల స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వారి ప్రేమ ముదిరిపోయింది. ఇక జీవితంలో వారు విడిపోకూడదు అని నిర్ణయించుకున్నారు. అలానే వారిద్దరూ కలిసి జీవనం సాగించేస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిని విడదీయడానికి ప్రయత్నించారు.

విడిపోవడానికి ఇష్టం లేని యువతులు… మేము ఇద్దరం కలిసే ఉంటాం, మమ్ముల్ని విడదీయకండి అని తల్లిదండ్రులను ఎంతగానో బతిమాలాడు. అందుకు వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరమ్మాయిలు చెన్నైలోని ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. సంస్థ సహాయంతో మద్రాసు హై కోర్టుకెక్కారు. మేమిద్దరం కలిసి జీవిస్తాం, తమ భవిష్యత్తు గురించి ఇతరులకు ఏం అవసరం? ఎలాగైనా మాతల్లిదండ్రుల నుంచి మాకు భద్రత కల్పించండని కోర్టను వేడుకున్నారు.

ఈ పిటిషన్‌ బుధవారం హైకోర్టు బెంచ్‌ ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు వాదనల్ని విన్న న్యాయస్థానం, ఇప్పుడే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇది వరకు కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తున్నామని సూచించారు. ఇద్దరు యువతుల వాంగ్మూలం, తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని వేర్వేరుగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. అలాగే, ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని, సమగ్ర విచారణతో ఏప్రిల్‌ 26వ తేదీ కోర్టుకు నివేదికను సమర్పించాలని సామాజిక కార్యకర్త విద్య దినకరన్‌నును న్యాయస్థానం ఆదేశించింది.


Next Story