వీడియో కాల్‌లో ప్రియుడి బట్టలు విప్పించి..

by  |
Young women cheating on young men
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పెరిగిపోతున్నా కొద్దీ సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే పెరిగిపోతుంది. నకిలీ సోషల్ మీడియా అకౌంట్లలో అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు పంపి, మానసికంగా వేధిస్తుండడం ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దాంతో బాధితులు లబోదిబో మంటున్నారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు పరిశోధనలో అనుసరించాల్సిన వ్యూహాలు, మెళకువలు, అత్యాధునిక పద్ధతులపై పోలీసులు పరిశోధన చేస్తున్నా… రోజుకో నేరం వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పటివరకూ ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్‌లోనే చాటింగ్‌ల పేరుతో మోసపోయిన వాళ్లనే మనం ఎక్కువగా చూశాం. కానీ, తాజాగా మ్యాట్రిమోనీ వేదికగా చేస్తున్న మోసాలు ఎక్కువైపోయాయి. మ‌త్తుగా మాట్లాడి మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌దంతా దోచుకోపోతున్న ఘటనలు అనేకం పెరిగిపోతున్నాయి.

తాజాగా.. కర్ణాటకలోని బెంగళూరులో ఇలాంటే ఘటనే చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన అంబీట్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి వివాహం కోసం అనేక సంబంధాలు వెతికి వెతికీ చివరకు మ్యాట్రిమోని సైట్‌లో తన పేరును రిజిస్టరు రిజిస్టర్ చేసుకున్నాడు. ఇప్పటికే ఆ సైట్‌లో మిశ్రా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న శ్రేయా అనే కిలాడీ లేడి కుమార్‌తో పరిచయం పెంచుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ నమ్మించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరగింది. దీంతో మిశ్రా ఆ కిలాడీ లేడీ మాయలో పడిపోయాడు. ఈ క్రమంలో రోజూ వీడియో కాల్స్‌లలో మునిగిపోయేవారు.

ఇటీవల వీడియో కాల్‌లో శ్రేయా తన దుస్తులను విప్పి, మిశ్రాను విప్పాలని అల్లరి చేసింది. చేసేందేంలేక అతను కూడా విప్పాడు. ఇదే అదునుగా భావించిన శ్రేయ అతని నగ్న వీడియోను రికార్డు చేసింది. అనంతరం మిశ్రాపై వేధింపులకు పాల్పడింది. లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. భయాందోళనకు గురైన మిశ్రా రూ.20 వేల వరకూ చెల్లించాడు. మిగతా డబ్బులు సర్దుబాటు కాక, శ్రేయ వేధింపులు ఎక్కువ కావడంతో మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. అంతే సంగతులు అని హెచ్చరించారు.

Next Story

Most Viewed