మెరుగైన వైద్యమే లక్ష్యం :వైద్య విధాన కమిషనర్ అనిల్ కుమార్

by Kalyani |
మెరుగైన వైద్యమే లక్ష్యం :వైద్య విధాన కమిషనర్ అనిల్ కుమార్
X

దిశ ,మిర్యాలగూడ టౌన్ : ప్రభుత్వ హాస్పిటల్ ల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ అనిల్ కుమార్ అన్నారు. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ను శనివారం తనిఖీ చేశారు. హాస్పిటల్ లో అందుతున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ ,ఆపరేషన్ థియేటర్ ,అన్ని వార్డులను ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం అదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో వసతుల ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అదనంగా నిర్మిస్తున్న భవన పనులను త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలోని నకిరేకల్ ,దేవరకొండ, నల్గొండ తదితర హాస్పిటల్ పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు . హాస్పిటల్ లో వసతుల కల్పనకు పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేధిక ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య సమన్వయ అధికారి మాతృ నాయక్ ,ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ సమరథన్ పలువురు వైద్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed