RCB ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్.. మరి కొన్ని నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభం

by Mahesh |
RCB ఫ్యాన్స్‌కి  అదిరిపోయే న్యూస్.. మరి కొన్ని నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: వర్షం కారణంగా ఆర్సీబీ, చెన్నై మ్యాచ్ నిర్వహణపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో మబ్బులు తెలికపాటి గా ఉండటం, వర్షం పడే అవకాశాలు తగ్గిపోవడంతో మ్యాచ్ పూర్తి స్థాయిలో నిర్వహించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు ప్రస్తుతం గ్రౌండ్ లోకి చేరుకుంటున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన ప్లే ఆఫ్ నాలుగో బెర్త్ కోసం చెన్నై, ఆర్సీబీ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ సీజన్ మొదట్లో వరుసగా ఓడిపోయిన ఆర్సీబీ జట్టు గత ఐదమ్యాచుల్లో గెలుస్తూ.. ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. అయినప్పటికీ ఈ రోజు జరిగే మ్యాచుల్లో ఆర్సీబీ 200+ పరుగులు చేయాలి. అలాగే 18 తేడాతో విజయం సాధించాలి. లేదంటే చెన్నై విధించిన టార్గెన్ ను 18.1 ఓవర్లలో చేధించాలి అప్పడే ఆర్సీబీ 14 పాయింట్లలో నెట్ రన్ రేట్ మెరుగు పరుచుకుని ప్లే ఆఫ్ చేరుకుంటుంది. ఇదిలా ఉంటే ఉదయం నుంచి బెంగళూరులో ఎండలు కొట్టగా, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో మ్యాచ్ నిర్వహణపై అభిమానుల్లో ఆందోళన నెలకొనగా.. తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రకారం మరికొద్ది క్షణాల్లో ప్లేయర్లు గ్రౌండ్ లోకి అడుగు పెట్టనున్నారని.. మధ్యలో ఎటువంటి వర్షం పడకపోతే.. పూర్తిస్థాయి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇరు జట్లకు అత్యంత కీలకం అయిన ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలియాంటే చివరి వరకు వేచి చూడాల్సింది.

Next Story

Most Viewed