యూరప్ ఖండంలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన తెలుగు యువతి..

by  |
anvitha
X

దిశ, భువనగిరి: యూరోప్ ఖండంలోనే ఎత్తైన 5,642 (18,510 అడుగులు) మీటర్ల ఎత్తు గల ఎలెబ్రస్ పర్వతాన్ని రెండున్నర రోజుల్లో అధిరోహించింది తెలుగు యువతి. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అన్వితారెడ్డి దక్షిణ భారతదేశం నుంచి వింటర్‌లో రష్యాలోని ఎలెబ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కింది. రెండున్నర రోజుల్లోనే పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా అన్వితారెడ్డి మాట్లాడుతూ.. ఈ యాత్ర నెల 4వ తేది మధ్యాహ్నం సమ్మిట్ నుండి మొదలు పెట్టడం జరిగిందని తెలిపింది.

అనుకూలించని వాతావరణంలో మైనస్ 40 డిగ్రీల మధ్య రాత్రి, పగలు యాత్ర సాగిందని పెర్కొంది. రెండున్నర రోజుల వ్యవధిలోనే శిఖరాగ్రం చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశానని తెలిపింది. ఈ యాత్ర తన జీవితంలో చిరకాలంగా గుర్తుంచుకునే విషయం అని అంది. సెవెన్ సమ్మిట్స్‌ను పూర్తి చేయడం తన లక్ష్యం అని తెలిపింది. ప్రభుత్వం పర్వతారోహకులను ప్రోత్సహిస్తే మరిన్ని ఘనతలు సాధిస్తామని పెర్కొంది.



Next Story