దారుణం.. పొలాల్లో సగం కాలిన యువతి శరీరం..

60

దిశ, సదాశివనగర్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామ శివారులో గుర్తు తెలియని యువతిని హత్య చేసి కాల్చి చంపినట్లు సీఐ రామన్ తెలిపారు. యువతిని ఎక్కడో హత్య చేసి మర్కల్ గ్రామ శివారులో కాల్చివేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని గురువారం పోలీసులు పరిశీలించారు. మృతురాలు ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో అరా తీస్తున్నారు. మర్కల్ గ్రామ శివారులోని 288/ఆ/1 లో మోర కృష్ణ రెడ్డి కౌలుకు చేస్తున్న చెరుకు పొలంలో మహిళలను కాల్చివేసినట్లు గుర్తించారు. బుధవారం సాయంత్రం వరకు మోర కృష్ణరెడ్డి తన పంట చేనులో పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళాడు.

ఉదయాన్నే అటుగా వెళ్లే వారు పంట చేనులో మహిళ మృతి చెందినట్లు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు వయసు 25-30 సంవత్సరములు ఉంటుందని తెలిపారు. డెడ్ బాడీ పాక్షికంగా కాలిందని, మృతురాలు తెలుపు రంగులో ఉండి, 5.4 ఫీట్స్ ఎత్తు కలిగి, పంజాబీ డ్రెస్ ధరించి ఉందన్నారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు తెలిపారు. మృతురాలిని గుర్తుపడితే సదాశివ నగర్ ఎసై 9440795425 సీఐ 9490618012 కు సమాచారం ఇవ్వాలన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..