- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపల కోసం వెళ్లిన యువకుడు.. వాగులో శవమై తేలాడు..
<p>దిశ, షాబాద్: షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ వాగులో ఓ శవం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. షాబాద్ మండలంలోని నాగర్ గూడ గ్రామానికి చెందిన బొర్రాతు ఇంద్రమ్మ, భర్త రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా చిన్న కొడుకైన బొర్రాతు శ్రీనివాస్(24) శుక్రవారం రోజు మధ్యాహ్న సమయంలో ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో బంధువులకు ఫోన్ చేసి అడుగగా వారు కూడా రాలేదని […]</p>

దిశ, షాబాద్: షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ వాగులో ఓ శవం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. షాబాద్ మండలంలోని నాగర్ గూడ గ్రామానికి చెందిన బొర్రాతు ఇంద్రమ్మ, భర్త రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా చిన్న కొడుకైన బొర్రాతు శ్రీనివాస్(24) శుక్రవారం రోజు మధ్యాహ్న సమయంలో ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో బంధువులకు ఫోన్ చేసి అడుగగా వారు కూడా రాలేదని చెప్పారు. అయితే.. సోమవారం నాడు నాగర్ గూడ వాగులో ఒక శవం లభ్యమైనట్లు సమాచారం అందుకున్న ఇంద్రమ్మ, ఆమె పెద్ద కొడుకు అక్కడికి వెళ్లారు. మృతదేహాన్ని చూసిన ఇంద్రమ్మ అది తన కొడుకే అని నిర్ధారణ చేసినట్లు సీఐ తెలిపారు. తన కొడుకు చేపల కోసం వెళ్లి వాగులో పడి, ఈత రాకపోవడంతో మరణించి ఉండవచ్చని పోలీసులకు తెలిపింది. అతని మృతి పట్ల ఎవరి మీద అనుమానం లేదని చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






