ఫ్రెండ్ తో బీచ్ కి వెళ్లి.. నరకాన్ని చూసింది

125

దిశ, వెబ్‌డెస్క్ : ఒక పక్క కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే.. మరో పక్క ఇలాంటి సమయంలోను మృగాళ్లు, మహిళలను వదలడం లేదు. వేధింపులకు గురిచేస్తూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. తాజాగా ఒక యువతిపై ముగ్గురు యువకులు సాముహిక అత్యాచారం చేసి, ఆమె నగ్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన తూర్పు గోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(21) బంధువుల ఇంటి వద్ద పెళ్లి ఉండడంతో 15 రోజుల క్రితం అల్లవరం వచ్చింది. అక్కడ పెళ్లికి  ఇంకా టైమ్  ఉండడంతో స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్రం చూడడానికి వెళ్ళింది. అక్కడ ముగ్గురు యువకులు మద్యం మత్తులో యువతి  స్నేహితుడిపై దాడి చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

అంతేకాకుండా ఆమె నగ్న ఫోటోలను తీసి ఎవరికైనా చెప్తే ఈ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. పరువు పోతుందని భావించిన యువతి ఎవరికి చెప్పకుండా ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో మరోసారి కీచకులు రెచ్చిపోయారు. మరోసారి తమ కోరిక తీర్చాలని యువతికి ఫోన్ చేసి బెదిరించారు. ఇక వారి వేధింపులు తాళలేని యువతి  పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..