భారీ ఎఫ్‌పీవోకు వెళ్లనున్న యెస్ బ్యాంక్!

by  |
భారీ ఎఫ్‌పీవోకు వెళ్లనున్న యెస్ బ్యాంక్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ యెస్ బ్యాంక్ భారీ ఎఫ్‌పీవోకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ వారంలో బ్యాంక్ కేపిటల్ రైజింగ్ కమిటీ నుంచి అనుమతి లభించిందని, దీంతో జులై 15 నుంచి 17 వరకు ఎఫ్‌పీవోకు వెళ్లనున్నట్టు తెలిపింది. దీనికి అవసరమైన పత్రాలను రెగ్యులేటరీకి అందజేసినట్టు, జులై 7న ముంబై రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆర్‌హెచ్‌పీని దాఖలు చేసినట్టు రెగ్యులేటరీ ఫలింగ్‌లొ పేర్కొంది. ఈ అంశంపై స్పందించిన యెస్ బ్యాంక్ ప్రతినిధి, ఎఫ్‌పీవో విలువ రూ. 15,000 కోట్లు ఉంటుందని, దీనికోసం త్వరలో కొత్త వాటాలను జారీ చేయనున్నట్టు వివరించారు. అలాగే, ఈ ఎఫ్‌పీవోలో ఉద్యోగుల కోసం రూ. 200 కోట్ల షేర్లను రిజర్వ్ చేశామని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ..యెస్ బ్యాంక్ ఎఫ్‌పీవోలో పెట్టుబడులను పెట్టడానికి రూ. 1760 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎస్‌బీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి ఇచ్చింది. మూలధనాన్ని పెంచే అంశంపై 2020 జూలై 7న స్టాక్ ఎక్స్ఛేంజీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎస్‌బీఐ సెంట్రల్ బోర్డ్ (ఈసీసీబీ) ఎగ్జిక్యూటివ్ కమిటీ 2020 జూలై 8న జరిగిన సమావేశంలో యెస్ బ్యాంక్ ఎఫ్‌పీవోలో గరిష్టంగా రూ. 1,760 కోట్ల పెట్టుబడికి అనుమతి ఇచ్చినట్టు వెల్లడించింది.



Next Story