అమ్మా రూమ్‌లో దెయ్యాలు ఉన్నాయంటూ ఏడ్చిన కూతురు.. తీరా వెళ్లి చూసిసరికి..

by Dishafeatures2 |
అమ్మా రూమ్‌లో దెయ్యాలు ఉన్నాయంటూ ఏడ్చిన కూతురు.. తీరా వెళ్లి చూసిసరికి..
X

దిశ, ఫీచర్స్ : ‘అమ్మా భయం వేస్తోంది.. నా రూమ్‌లో దెయ్యాలున్నాయ్’ అంటూ తమ కూతురు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోలే.. చిన్న పిల్ల కదా అనుకున్నారు. ఒకరోజు అలా గడిచిపోయింది. మరో సందర్భంలోనూ అదే మాట చెప్పింది తమ గారాల కూతురు. ఈసారి కూడా తనేదో భయపడి ఉంటుందని సర్ది చెప్పుకున్నారు పేరెంట్స్. అయినా అలా చెప్పడం మాత్రం ఆపలేదు వాళ్ల గారాల కూతురు. ప్రతిరోజూ తన గదిలో దెయ్యాలున్నాయని చెప్పడం కంటిన్యూ చేసేసరికి ఇక తల్లిదండ్రుల మనసులోనూ అనుమానం మెదిలింది. ఒక్క క్షణం వారి గుండె జలదరించింది.

దెయ్యాలు నిజంగానే వస్తున్నాయా? తమ కూతురుకు ఏమైనా హాని తలపెడతాయా? అనే ఆలోచనలో పడ్డారు ఆ బాలిక తల్లిదండ్రులు. మరుసటి రోజు తమ కూతురు దెయ్యాలున్నాయ్ అని చెప్పగానే వాటి సంగతి చూడాలనుకున్నారు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే మరోసారి ‘అమ్మా నా రూమ్‌లోకి దెయ్యాలొచ్చాయ్’ అన్న కూతురు పిలుపుతో అలర్ట్ అయ్యారు. వెంటనే వెళ్లి ఆమె రూములో వెతకగా అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ వాళ్లెవరు? ఏం జరిగిందనే కదా మీ అనుమానం? అక్కడికే వద్దాం!

అది నార్త్ కరోలినాలోని ఓ గ్రామం. డేవిడ్, జెసికా దంపతులు తమ కూతురితో కలిసి వారసత్వంగా వచ్చిన పాత ఇంటిలో నివసిస్తున్నారు. ఆ బాలిక మూడవ తరగతి చదువుతోంది. ఒకరోజు అందరూ నైట్‌లో సినిమాకు వెళ్లొచ్చారు. ఆ రోజు నుంచి ప్రతిరోజూ ఆ బాలిక తన రీడింగ్ రూమ్‌లో చదువుకుంటున్నప్పుడల్లా దెయ్యాలొచ్చాయని చెప్పసాగింది. కానీ మొదట్లో డేవిడ్ జెసికా నమ్మలేదు. కానీ రోజూ చెప్పేసరికి ఒకరోజు కాపుకాసి మరీ తమ కూతురు పిలవగానే వెళ్లి వెతికారు.

ఎంత వెతికినా దెయ్యం కనిపించలేదు. తమ కూతురు మాత్రం అదిగో అక్కడ ఉందని చెప్తూ చూపెట్టగా అటువైపు చూశారు. ఇంకేముంది అది చూసి షాక్ అయి వెంటనే హమ్మయ్యా ఇంతేనా అని ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అక్కడ తమ బాలిక ఉన్నదని చెప్పిన దెయ్యం మరేదో కాదు. అదొక పెద్ద తేనెతుట్టె. గదిపై భాగాన గోడ లోపలి భాగంలో నల్లటి ఆకారంలో కనిపించింది. అక్కడ జుమ్ అంటూ తేనెటీగల శబ్దం కూడా వస్తోంది. పెస్ట్ కంట్రోల్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ తల్లిదండ్రులు తమ కూతురిని ఇన్నాళ్లు భయపెట్టిన తేనె తుట్టెను తొలగించారు.

Next Story

Most Viewed