BIG ALERT: మే 23న అక్కడ తీవ్ర తుఫాను.. ఈ మూడు రాష్ట్రాలపై పొంచివున్న ముప్పు

by Anjali |
BIG ALERT: మే 23న అక్కడ తీవ్ర తుఫాను.. ఈ మూడు రాష్ట్రాలపై పొంచివున్న ముప్పు
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడటంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది. మొన్నటిదాక ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవ్వడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఒక్కసారిగా సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో జనాలు ఇంట్లో నుంచి బయటికెళ్లడానికి భయపడిపోయారు. ప్రస్తుతం వర్షాలు పడటంతో ప్రజలకు బిగ్ రిలీఫ్ దొరికింది. అయితే పలు రాష్ట్రాల్లో మాత్రం మాడు పగిలే ఎండలు, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొద్ది రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మే 23 నాటికి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఇది 23-27 మధ్య ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. మే 28 నాటికి గుజరాత్- ముంబైలలో భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు.



Next Story

Most Viewed