దారుణం.. భూమి కాజేయ్యొద్దంటే రూ. కోటి రూపాలియ్యాలంట

by  |
land-1
X

దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం గత 70 సంవత్సరాలుగా కొనసాగుతుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటది. సర్వే నెంబర్ 623లో ఈ దేవాలయం ఉంది. అయితే, ఈ దేవాలయం ఉన్న భూమిలో కడీలతో పెన్సింగ్ వేశారు. ఈ భూమి గతంలో తమ పేరు మీద ఉందంటూ ఆక్రమిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. లేదంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు జోక్యం చేసుకుని ఎల్లమ్మ ఆలయ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలోనే ఈ భూమిని ఓ వ్యక్తి అమ్ముకున్నాడని మళ్లీ ఇప్పుడు ఆ భూమి నాది అంటున్నాడని.. ఇది ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

land-2

ఎమ్మార్వో వివరణ

ఎల్లమ్మ గుడి ముందర కడీలతో పెన్సింగ్ చేసిన విషయమై తమకు ఓ వ్యక్తి నాలా కన్వర్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడని, అట్టి దరఖాస్తును రిజెక్ట్ చేశామని ఎమ్మార్వో తెలిపారు. జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు వచ్చి స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. అట్టి భూమిని రిజెక్ట్ చేయాలని పై అధికారులకు విన్నవించానని ఎమ్మార్వో పేర్కొన్నారు.

Next Story

Most Viewed