పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేర్ ఫొటోస్ వైరల్.. ఇప్పుడు బయటపడటానికి కారణం ఇదేనా?

by Anjali |
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేర్ ఫొటోస్ వైరల్.. ఇప్పుడు బయటపడటానికి కారణం ఇదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబిల్‌ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ప్రభాస్ పెద్దమ్మ ఈ ఏడాదే రెబల్ స్టార్ మ్యారేజ్ అవ్వనుందని, ఆ అమ్మాయి ఎవరో కూడా త్వరలో రివీల్ చేస్తానని చెప్పినట్లు నెట్టింట వార్తలు దుమారం రేపుతున్నాయి. ఇకపోతే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తండ్రి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ నాన్న రేర్ ఫొటోలు చూస్తుంటే అచ్చం ప్రభాస్ ను చూస్తున్నట్లుగానే ఉంది. సో హ్యాండ్సమ్ అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ నెట్టింట పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజు ఒకప్పుడు నిర్మాతగా రాణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పెద్దగా ఆయన ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఇప్పుడు సత్యనారాయణ రాజు ఫొటోలు లీక్ అవుతుండటంతో నిజంగానే ప్రభాస్ వివాహం చేసుకుంటున్నాడేమో అంటూ నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు.

ఇకపోతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘Kalki 2898 AD’ చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే రాజాసాబ్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక ఇటీవల తెరకెక్కిన ‘సలార్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సునామీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది.

Next Story