దేశంలో మోడీ వేవ్ కనిపిస్తోంది.. బీఆర్ఎస్ MP అభ్యర్థి షాకింగ్ కామెంట్స్

by GSrikanth |
దేశంలో మోడీ వేవ్ కనిపిస్తోంది.. బీఆర్ఎస్ MP అభ్యర్థి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 272 సీట్లు రాకపోతే.. బీజేపీ అగ్రనేతలే మోడీని ప్రధానిమంత్రి పదవి చేపట్టకుండా చేస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఉత్తర ప్రదేశ్‌లో చేసిన ప్రసంగం చూస్తే మోడీలో ఉన్న ప్రస్టేషన్ కనిపిస్తోందని విమర్శించారు. రామ మందిరం కూల్చే దమ్ము ఎవరికైనా ఉంటుందా..? అని మాట్లాడుతున్నారు.. అంటే ఓడిపోతున్నారు అని తెలిసే మళ్లీ విద్వేశాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోవైపు దేశంలో మోడీ వేవ్ కనిపిస్తోందని.. ఆ ప్రభావం తెలంగాణలో కూడా ఉన్నదని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయింది, కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండి అని సూచించారు. 2019లో పొన్నం ప్రభాకర్‌కు డిపాజిట్ రాలేదు, ఈసారి వెలిశాల రాజేందర్ రావుకు కూడా డిపాజిట్ పోతుందని అన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారు.. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story

Most Viewed