‘సీవ్యూ’తో ఉద్యోగం గ్యారంటీ.. కెరీర్ విషయంలో పరిష్కారం!

by  |
Cview
X

దిశ, ఫీచర్స్ : సాఫ్ట్‌వేర్ పూర్తి చేసిన సంతోష్ ఉద్యోగం కోసం తన ‘కరిక్యులమ్ వీటే’(సీవీ)ని పలు జాబ్ పోస్టింగ్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేశాడు. కానీ ఏ కంపెనీ నుంచి కూడా తనకు కాల్ రాలేదు? జాబ్ పొందేందుకు అన్ని అర్హతలున్నా ఫోన్‌ రాకపోవడానికి తన సీవీనే కారణమని అతడు గుర్తించలేకపోయాడు. సంతోష్ ఒక్కడే కాదు.. ఎంతోమంది ఉద్యోగార్థులు సీవీ దగ్గరే పొరపాటు చేస్తుంటారు. గూగుల్ గాలిస్తే.. ఓ పది-ఇరవై సీవీ ఫార్మాట్స్ కనిపిస్తాయి. దీంతో వాటినే తమ వివరాలతో ఎడిట్ చేసి అప్లయ్ చేస్తుంటారు. ప్రతి సీవీ పైన నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు సమయాన్ని వెచ్చించే ఆయా సంస్థలు.. అందరి ‘సీవీ’లానే నీదీ ఉన్నప్పుడు నిన్నెలా సెలెక్ట్ చేస్తాయి? నీలోని ప్రత్యేకతను ఎలా గుర్తిస్తాయి? అందుకే సమాచారం సమగ్రంగా ఉంటూనే, ఇతరుల కంటే మనం ఎంత భిన్నమో కూడా ఆ సీవీ ప్రస్ఫుటించాలి అప్పుడే హెచ్‌ఆర్ నుంచి కాల్ అందుకోవచ్చు. అయితే మన నైపుణ్యాల ఆధారంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సీవీని అద్భుతంగా ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తున్న ‘సీవ్యూ’(CView) 70శాతం ఇంటర్వ్యూ కాల్‌ పొందేలా సాయం చేస్తోంది.

కెరీర్ విషయంలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించేందుకు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్(ATS)-కంప్లయింట్ సీవీ సర్వీస్‌ను రూపొందించింది ‘సీవ్యూ’. ఈ తరహా సేవలందిస్తున్న భారతదేశపు మొదటి సంస్థ ఇదే కాగా 10,000 మంది నిరుపేద కళాశాల విద్యార్థులకు మెంటారింగ్ సంస్థగానూ భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందింది. 20 దేశాల్లో సర్వీస్ అందిస్తున్న సీవ్యూను చావీ అగర్వాల్ స్థాపించగా.. రిక్రూటర్స్, యజమానుల మధ్య ఉన్న అంతరాన్ని పరిశీలించింది. అంతేకాదు సీవీ ప్రాముఖ్యత ఉద్యోగ అభ్యర్థులు గుర్తించడం లేదని గమనించింది. సమగ్ర మార్కెట్ పరిశోధన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా తిరస్కరించిన గరిష్ట దరఖాస్తులు.. పేలవంగా ఉన్న సీవీలే కారణమని తెలుసుకున్న ఆమె, ‘సీవ్యూ’తో ఆ గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేయాలనుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతకు మానవ నైపుణ్యాలను మిళితం చేసి విద్యార్థులకు బలమైన, గుర్తించదగిన CVని రూపొందించడంలో సీవ్యూ ద్వారా మార్గనిర్దేశం చేస్తోంది.

సీవీ ప్రిపరేషన్ ?

ప్రొఫైల్ అసెస్‌మెంట్ షీట్‌ను ఫిల్ చేసిన తర్వాత, సీవ్యూ మెంబర్స్ నుంచి ఆ అభ్యర్థికి కాల్ వస్తుంది. మన నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్న తర్వాత ఏఐ సాయంతో క్యూరేటింగ్ ప్రారంభిస్తారు. CVని ATS సిస్టమ్ ద్వారా జాబ్ పోస్టింగ్స్ సైట్స్‌లో ప్లేస్ చేసి, మన సీవీని మనకు అందిస్తారు. ఇందుకోసం సీవ్యూ త్రీ యూఎస్‌పీ పాయింట్స్‌ను సెలెక్ట్ చేసింది.

*అంతర్గత అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టం : సిస్టం 1,00,000 కంటే ఎక్కువ CVల డేటాబేస్‌ను ఉపయోగించి పర్‌ఫెక్ట్ సీవీని రూపొందిస్తుంది. CView ద్వారా ప్రిపేర్ చేసిన సీవీలు ఎండ్-టు-ఎండ్ ATS కంప్లయింట్‌తో, కనిష్ట ATS స్కోర్ 90ని కలిగి ఉంటాయి.

*పర్సనల్ డిస్కషన్స్: ఉద్యోగ అభ్యర్థులతో పర్సనలైజ్డ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ సమాచారాన్ని కలెక్ట్ చేస్తారు. వారి అనుభవాలు, అర్హతలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా ఓ అంచనాకు వస్తారు.

*సమగ్ర ప్రొఫైల్ అసెస్‌మెంట్ షీట్ : ప్రతీ కస్టమర్ వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణ సారాంశాన్ని సంగ్రహించి ప్రొఫైల్ అసెస్‌మెంట్ షీట్ తయారుచేస్తారు.

‘ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మించిన బహుమతి మరొకటి లేదన్నది నా అభిప్రాయం. మహిళా సాధికారత ప్రచారకర్తగా, CView ఆదాయంలో 30% భారతదేశంలోని స్త్రీ విద్యకు విరాళంగా అందజేస్తున్నాం. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌తో పాటు, పని ప్రదేశాల్లో వారిని ప్రోత్సహించేందుకు అనేక వెబ్‌నార్స్ నిర్వహిస్తుంటాం. CView గ్రేడ్ 12 విద్యార్థులకు, వివిధ ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు.. ATS కంప్లయింట్ CV ప్రాముఖ్యత గురించి తెలియజేసేందుకు ‘బ్యాక్ టు స్కూల్’ అనే వెబ్‌నార్‌ను కూడా తరుచుగా నిర్వహిస్తుంటాం. 10k+ నిరుపేద కళాశాల విద్యార్థులకు ఉద్యోగాలు పొందడంలో సాయపడగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది మహిళలు స్వయం సమృద్ధిని పొందేందుకు మా తోడ్పాటును అందించామ’ని చావీ అగర్వాల్ చెప్పుకొచ్చారు.

సీవీ ప్రిపరేషన్‌ కోసమే కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ లేదా ప్రొఫైల్ బిల్డింగ్ విషయాల్లోనూ.. ఇంటర్న్‌షిప్స్, MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్స్ కోసం ‘సీవ్యూ’ను సంప్రదించొచ్చు. కెరీర్ మార్పు కోరుకున్నా. విదేశాల్లో ఉద్యోగాల కోసం, గ్యాప్ సంవత్సరాలను పూరించడంలోనూ సీవ్యూ సలహాలు అందిస్తోంది.

Next Story

Most Viewed