27 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!

by  |
27 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కూరగాయలు, ఇంధన, ఇతర నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో టోకు ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్ఠానికి చేరింది. హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(డబ్ల్యూపీఐ) ఈ ఏడాది ఫిబ్రవరికి గానూ 4.17 శాతంగా నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. జనవరిలో ఇది 2.03 శాతంగా ఉంది. 2018, నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 4.47 శాతంగా నమోదైన తర్వాత మళ్లీ ఇంత ఎక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి. గతేడాది ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణం 2.26 శాతంగా నమోదైందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

జనవరిలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం -2.80 శాతం నుంచి 1.36 శాతానికి చేరింది. కూరగాయల ధరల పెరుగుదల జనవరిలో -20.82 శాతం నుంచి -2.90 శాతానికి, పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం 10.25 శాతం, ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 0.58 శాతం, తయారీ రంగ ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం జనవరిలో 5.13 శాతం ఉండగా, ఫిబ్రవరిలో 5.81 శాతంగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.


Next Story