ప్రపంచానికి పెద్ద తాతయ్య ఇక లేరు!

by  |
ప్రపంచానికి పెద్ద తాతయ్య ఇక లేరు!
X

దిశ, నెట్‌వర్క్: ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన చిటేట్సు వతనబే ఇక లేరు. జపాన్‌కి చెందిన చిటేట్సు 112 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆ చనిపోయినట్లుగా నిగాటా ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. నిగాటాలోని నర్సింగ్ హోంలో నివసిస్తున్న వతనబే 1907, మార్చి 5న జన్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ప్రపంచంలో అత్యంత పెద్దవయస్కుడని గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకటించింది. సరిగ్గా పది రోజులకు అంటే ఫిబ్రవరి 23న వతనబే మరణించారు. తాను ఎక్కువ కాలం జీవించడానికి కోపం తెచ్చుకోకపోవడం, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండటమే రహస్యమని వతనబే అనేవారు.

గిన్నిస్ వారి వివరాల ప్రకారం, నిగాటాలో పుట్టిన వతనబే తైవాన్‌లోని చెరుకు తోటల్లో పనిచేశారు. తర్వాత మళ్లీ సొంత ఊరికి వచ్చి ఒక వ్యవసాయ కేంద్రంలో రిటైరయ్యే వరకు పనిచేశారు. ఇంకొక్క నాలుగేళ్లు బతికి ఉంటే ఇప్పటివరకు భూమ్మీద అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా వతనబే నిలిచి జపాన్‌కి చెందిన జిరోమోన్ కిమురా పేరును తిరగరాసేవారని గిన్నిస్ తెలిపింది. కిమురా 1897 ఏప్రిల్ 19న పుట్టి జూన్ 2013 నాటికి 116 ఏళ్ల 54 రోజులు బతికి భూమ్మీద అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా రికార్డుకెక్కారు.

Next Story

Most Viewed